కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రి బుగ్గన భేటీ

|

Oct 20, 2020 | 11:09 PM

మంగళవారం ఢిల్లీలో పర్యటించిన ఆయన కేంద్ర విమానయాన మంత్రి హార్ధిప్‌సింగ్‌తో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమావేశమయ్యారు.

కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రి బుగ్గన భేటీ
Follow us on

వచ్చే నెలలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టు ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఢిల్లీలో పర్యటించిన ఆయన కేంద్ర విమానయాన మంత్రి హార్ధిప్‌సింగ్‌తో ఆయన సమావేశమయ్యారు. అలాగే భోగాపురం ఎయిర్‌పోర్టులు పనులు సత్వరమే ప్రారంభించాలని కేంద్రమంత్రిని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బుగ్గన.. విశాఖ నావెల్‌ ఎయిర్‌పోర్టు విధివిధానాలపై చర్చించామన్నారు. వచ్చే నెలలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉందని.. వచ్చే నెలలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టు ప్రారంభిస్తామన్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ ఫీజులు తదితర అంశాలకు సంబంధించి మినహాయింపులు కోరినట్లు మంత్రి వివరించారు. ఏపీలో నూతన జాతీయ రహదారుల అంశంపై త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తానని మంత్రి తెలిపారు.

అంతేకాకుండా, గత కొన్ని రోజులుగా ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై రెవెన్యూశాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని తక్షణమే రూ.2,250 కోట్ల ఆర్థికసాయం అందించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం వైఎస్ జగన్ లేఖ రూపంలో విజ్ఞప్తి చేశారు. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపాలని లేఖలో కోరారు.