చౌకైన ధరకే ప్లేట్ ఇడ్లీ.. ఎక్కడో తెలుసా..?

| Edited By:

Aug 03, 2019 | 1:13 PM

తిరుమల తిరుపతి దేవస్థానానికి రోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అయితే తిరుమల కొండపై భక్తులకు అతి తక్కువ ధరలకే భోజన సదుపాయం కల్పించేందుకు దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కొండపై ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం రెండు ఇడ్లీలకు రూ.25, ప్లేట్ మీల్స్‌కు రూ.60 వసూలు చేస్తున్నారు. కాగా, ఇక నుంచి కొండపై ప్లేట్ […]

చౌకైన ధరకే ప్లేట్ ఇడ్లీ.. ఎక్కడో తెలుసా..?
Follow us on

తిరుమల తిరుపతి దేవస్థానానికి రోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అయితే తిరుమల కొండపై భక్తులకు అతి తక్కువ ధరలకే భోజన సదుపాయం కల్పించేందుకు దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కొండపై ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం రెండు ఇడ్లీలకు రూ.25, ప్లేట్ మీల్స్‌కు రూ.60 వసూలు చేస్తున్నారు. కాగా, ఇక నుంచి కొండపై ప్లేట్ ఇడ్లీ రూ.7.50, భోజనం రూ.22.50గా విక్రయించాలని దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయించారు. ఫుల్ మీల్స్‌కు రూ.31గా తీసుకోవాలని దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా సరే నిర్ణయించిన ధరకు కాకుండా ఎక్కువ ధరకు ఫుడ్ ను సప్లై చేస్తే.. టోల్‌ ఫ్రీ నంబర్ 18004254141కి ఫోన్ చేయాలని ఏపీ ఎండోమెంట్స్ విభాగం తెలిపింది.