ఎంపీ మోపిదేవికి తృటిలో తప్పిన ప్రమాదం..

ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణకు తృటిలో ప్రమాదం తప్పింది. వాళ్లు ప్రయాణిస్తున్న వెహికల్.. కాన్వాయ్‌లోని ముందు వాహనాన్ని ఢీకొట్టింది.

  • Ravi Kiran
  • Publish Date - 2:01 pm, Fri, 21 August 20
ఎంపీ మోపిదేవికి తృటిలో తప్పిన ప్రమాదం..

Accident Occurred For AP Deputy CM Convoy: ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణకు తృటిలో ప్రమాదం తప్పింది. వాళ్లు ప్రయాణిస్తున్న వెహికల్.. కాన్వాయ్‌లోని ముందు వాహనాన్ని ఢీకొట్టింది. అంతులో.. మోపిదేవి కారును వెనుక నుంచి మరో వాహనం ఢీ కొట్టింది. విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం హైవేపై ఈ ఘటన జరిగింది.

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, ఎంపీ మోపిదేవి వెంకటరమణలు ఒకే వాహనంలో ప్రయాణిస్తున్నారు. అయితే.. వారి కాన్వాయ్‌ మధ్యలోకి ప్రైవేట్‌ వాహనం రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. మోపిదేవి వాహనానికి ముందుభాగం స్వల్పంగా ధ్వంసమైంది. కాగా, వీరిద్దరూ మరో వాహనంలో విశాఖకు ప్రయాణమయ్యారు.

Also Read:

”భారత్‌లో డిసెంబర్ 3 నాటికి కరోనా అంతం”

కరోనా సోకినట్లయితే.. మొదటిగా కనిపించే లక్షణం ఇదే..!

కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..