శ్రీశైలం అగ్ని ప్రమాద ఘటనపై స్పందించిన గవర్నర్ తమిళిసై
శ్రీశైలంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రమాదస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని గవర్నర్ తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు..
శ్రీశైలంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రమాదస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని గవర్నర్ తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు గవర్నర్ తమిళిసై.
కాగా నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగల పెంట శ్రీశైలం ప్రాజెక్టు లెఫ్ట్ పవర్ హౌస్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి విద్యుత్ తయారీ కేంద్రంలోని మొదటి యూనిట్‌లో భారీ పేలుడు సంభవించి, అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. విధుల్లో ఉన్న వారిలో పది మంది బయటకు రాగా.. 9 మంది గల్లంతు అయ్యారు. వీరిని బయటకు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన ఆరుగురు సిబ్బంది జెన్‌కో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరిలో డీఈ పవన్ కుమార్, ప్లాంట్ జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ కూడా ఉన్నారు.
Fire accident in Srisailam power plant causing loss of lives & injuries worries me a lot.Rescue and relief #relief #operations already started will save others.Share the grief of families and pray for speedy recovery of others admitted in Hospitals
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 21, 2020
Read More:
ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన రైనా
ప్రభాస్ ‘ఆది పురుష్’ గ్రాఫిక్స్ కోసం అంత ఖర్చా?