AP CS Adityanath Das PC: ఏపీలో రాష్ట్ర, జిల్లాస్థాయి మత సామరస్య కమిటీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌

|

Jan 07, 2021 | 9:23 PM

సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌ నేతృత్వంలో 8 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కలెక్టర్ల అధ్యక్షతన ఆరుగురితో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎస్ తెలిపారు.

AP CS Adityanath Das PC: ఏపీలో రాష్ట్ర, జిల్లాస్థాయి మత సామరస్య కమిటీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌
adityanath das
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకుంది. రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌ నేతృత్వంలో 8 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కలెక్టర్ల అధ్యక్షతన ఆరుగురితో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కమిటీలు రాష్ట్రంలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తాయన్నారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే కమిటీ అని సీఎస్ పేర్కొన్నారు. ప్రజాసేవలో ఉన్నవారికి మతం ఆపాదించడం సరికాదన్న సీఎస్.. మత సామరస్యం దెబ్బతినడంతో పాటు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు. వరుస ఘటనలకు బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు పోలీసుశాఖ ప్రయత్నం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర కమిటీలో హోం, సాధారణ పరిపాలన, దేవాదాయ, మైనార్టీ సంక్షేమశాఖల ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. కమిటీలు తరచూ సమావేశమవుతాయని సీఎస్ చెప్పారు. రాష్ట్ర కమిటీలో సభ్యులుగా అన్ని మతాలకు చెందిన ఒక్కో ప్రతినిధి ఉంటారన్నారు. ఈ కమిటీలు రాష్ట్రంలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తాయని సీఎస్‌ వెల్లడించారు. కమిటీలకు ప్రస్తుతానికి ఎలాంటి కాలపరిమితి లేదని.. ప్రజలకు భరోసా కల్పించేందుకే కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ఉద్యోగాల భర్తీలో స్పీడ్ పెంచిన తెలంగాణ సర్కార్.. ఖాళీల వివరాలు సేకరించిన సీఎస్..