ఏపీలో కొత్తగా 5,795 మందికి కొవిడ్ పాజిటివ్

ప్రపంచవ్యాప్తం కరోనా మహమ్మారి ఇప్పడప్పుడే వదిలేలా కనిపించడంలేదు. గత కొద్దిరోజులుగా కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతుండగా, మరోసారి క్రమంగా కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

ఏపీలో కొత్తగా 5,795 మందికి కొవిడ్ పాజిటివ్

Updated on: Oct 06, 2020 | 6:27 PM

ప్రపంచవ్యాప్తం కరోనా మహమ్మారి ఇప్పడప్పుడే వదిలేలా కనిపించడంలేదు. గత కొద్దిరోజులుగా కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతుండగా, మరోసారి క్రమంగా కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నట్టే కనిపించినా మళ్లీ విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 65,889 నమూనాలను పరీక్షించగా 5,795 మందికి కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడినవారి సంఖ్య 7,29,307కి చేరింది. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 33 మంది కరోనా వైరస్ బారినపడి చికిత్స పొందుతూ మృతిచెందారు. కృష్ణా జిల్లాలో 6 మంది, ప్రకాశం 5, తూర్పుగోదావరి 4, విశాఖపట్నం 4, అనంతపురం 3, చిత్తూరు 3, గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరిలో ఇద్దరేసి.. కడప, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మాయదారి రాకాసి కోరలకు బలయ్యారు. తాజా మరణాలతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటి వరకు కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 6,052కి చేరింది. 24 గంటల్లో 6,046 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యి ఇళ్లకు చేరుకున్నారు. ఇక, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 62,16,240 నమూనాలను సేకరించి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు.