గ్రామాల రూపురేఖలు మారబోతున్నాయ్.. అనంతపురంజిల్లాలో కొత్తగా 3 రిజర్వాయర్లు, టీడీపీ పాలనలో లంచాలకు ఇదే నిదర్శనం: జగన్

అనంతపురం జిల్లాలో కొత్తగా మూడు రిజర్వాయర్లను నిర్మిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు...

గ్రామాల రూపురేఖలు మారబోతున్నాయ్.. అనంతపురంజిల్లాలో కొత్తగా 3 రిజర్వాయర్లు, టీడీపీ పాలనలో లంచాలకు ఇదే నిదర్శనం: జగన్
Follow us

|

Updated on: Dec 09, 2020 | 6:18 PM

అనంతపురం జిల్లాలో కొత్తగా మూడు రిజర్వాయర్లను నిర్మిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. హంద్రినీవా ద్వారా సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాం కు నీరు తరలించేందుకు 803 కోట్లతో టీడీపీ అంచనాలు వేసిందని, అదే డబ్బుతో మేము నాలుగు రిజర్వాయర్లు అదనంగా నిర్మించి పేరూరు డ్యాంకు నీరందిస్తున్నామని తెలిపారు. 75,000 ఎకరాలకు సాగునీరు, చాలా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టు కాస్ట్ పెంచకుండా ఎక్కువ లబ్ది చేకూరుస్తున్నామన్న జగన్, టీడీపీ పాలనలో లంచాలు ఏస్థాయిలో ఉన్నాయో దీన్ని బట్టి తెలుస్తోందన్నారు. పేరూరు డ్యాం, ఇతర నాలుగు రిజర్వాయర్ల పరిధిలోని 75,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో జనతా బజార్లు తెస్తామని, రానున్న రోజుల్లో గ్రామాల రూపురేఖలు మార్చబోతున్నామని జగన్ స్పష్టం చేశారు.