జగన్ సంచలనం.. పది రోజుల్లో రేషన్, పింఛన్.. 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు..

సంక్షేమ పథకాల అమల్లో ఏపీ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి పది రోజుల్లోనే రేషన్, పింఛన్ కార్డులు జారీ చేస్తామని సీఎం వై ఎస్ జగన్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో పింఛన్‌.. 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు

జగన్ సంచలనం.. పది రోజుల్లో రేషన్, పింఛన్.. 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు..

Edited By:

Updated on: Jun 09, 2020 | 7:04 PM

సంక్షేమ పథకాల అమల్లో ఏపీ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి పది రోజుల్లోనే రేషన్, పింఛన్ కార్డులు జారీ చేస్తామని సీఎం వై ఎస్ జగన్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో పింఛన్‌.. 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు.. 90 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించి మహిళలకు ఇళ్ల పట్టాలు అందిస్తామన్నారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులకు రూ.2,250 పెన్షన్ అందిస్తున్నామని, అవినీతి లేని వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం జగన్ స్పష్టంచేశారు.

Also Read: కరోనా వైరస్ లక్షణాలు లేనివారితో.. సంక్రమణం అరుదు..: ప్రపంచ ఆరోగ్య సంస్థ