నాకు నచ్చిన కార్యక్రమం ఇది : ఏపీ సీఎం

గుంటూరులోని తాడేపల్లి మండలం పెనుమాక జెడ్పీ పాఠశాలలో సీఎం జగన్ ప్రారంభించిన ‘రాజన్న బడిబాట’ కార్యక్రమానికి పలువురు మంత్రులు ఆదిమూలపు సురేష్, సుచరిత, తదితరులు హాజరయ్యారు. అలాగే.. భారీగా పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ చిన్నారులతో దగ్గరుండి అక్షరాభ్యాసం చేయించి, ‘రాజన్న బడిబాట’ లోగోను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు నాకు నచ్చిన కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. నా సుదీర్ఘమైన పాదయాత్రలో విద్యార్థుల […]

నాకు నచ్చిన కార్యక్రమం ఇది : ఏపీ సీఎం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 14, 2019 | 2:06 PM

గుంటూరులోని తాడేపల్లి మండలం పెనుమాక జెడ్పీ పాఠశాలలో సీఎం జగన్ ప్రారంభించిన ‘రాజన్న బడిబాట’ కార్యక్రమానికి పలువురు మంత్రులు ఆదిమూలపు సురేష్, సుచరిత, తదితరులు హాజరయ్యారు. అలాగే.. భారీగా పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ చిన్నారులతో దగ్గరుండి అక్షరాభ్యాసం చేయించి, ‘రాజన్న బడిబాట’ లోగోను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు నాకు నచ్చిన కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.

నా సుదీర్ఘమైన పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు కళ్లారా చూశాను. సరైన సమయానికి పుస్తకాలు, యూనిఫామ్స్ అందేవి కావని, పాఠశాలల్లో కనీస వసతులు కూడా లేవని, ఇక అలాంటి సమస్యలు ఉండవన్నారు. పిల్లలందరూ చదువుకోవాలి, పిల్లల చదువే నా ఆశయమన్నారు. పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఇక అప్పులపాలు కాకూడదు. చదువుకోవాలన్న కోరిక మీది, చదివించే బాధ్యత నాదన్నారు. తల్లిదండ్రులు కేవలం పిల్లలను బడులకు పంపడమే వారి బాధ్యతన్నారు. జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా పండుగ రోజన్నారు. ప్రతీ సంవత్సరం జనవరి 26వ తేదీన పిల్లల తల్లులకు రూ.15వేలు అందజేస్తామన్నారు.

ఇప్పుడున్న స్కూల్ పరిస్థితులన్నీ మార్చేస్తానని, అన్ని వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ప్రభుత్వ స్కూల్ ఇంగ్లీష్ మీడియం కావాలి. అలాగే.. ప్రతి స్కూల్‌లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తామన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..