నేడు బాపూ మ్యూజియాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్

|

Oct 01, 2020 | 8:13 AM

గత పదేళ్ల కిందట మూతబడ్డ చారిత్రక బాపూ మ్యూజియానికి ఇక పూర్వ వైభవం తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.

నేడు బాపూ మ్యూజియాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
Follow us on

గత పదేళ్ల కిందట మూతబడ్డ చారిత్రక బాపూ మ్యూజియానికి ఇక పూర్వ వైభవం తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. రూ.8 కోట్లతో అభివృద్ధి చేసిన బాపూ మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. మ్యూజియంలో సందర్శకులు వీక్షించేందుకు 1,500 పైగా పురాతన వస్తువులని అందుబాటులో ఉంచారు. కాగా, ఈనెల 2వ తేదీన గాంధీ జయంతి నుంచి ఈ మ్యూజియం నగర ప్రజలు సందర్శించేందుకు అందుబాటులో ఉంచనున్నారు.

పురాతన వస్తువుల వివరాల తెలుసుకునేందుకు సందర్శకులకి అత్యాధుక సాంకేతిక‌ పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకువచ్చారు. నూతన టెక్నాలజీ ద్వారా వస్తువుల వివరాలు ఫోన్‌లోనే చూసేలా ప్రత్యేక యాప్ ను కూడా రూపొందించారు. జైన, బుద్ద, హిందూ విగ్రహాలు, రాజుల కాలంలో వాడిన కత్తులు, నాణాలు..ఇలా ఎన్నో ప్రత్యేకతలతో మ్యూజియం సిద్దమైంది. మ్యూజియం పక్కనే ఉన్న విక్టోరియా స్మారక భవనం ఇండో యూరోపియన్ వాస్తు కళని ప్రతిభించేలా తీర్చిదిద్దారు.10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే అరుదైన 1,500 వస్తువులను బాపు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఆది మానవుడి నుంచి 19వ శతాబ్ధపు ఆధునిక మానవుడు వరకు ఉపయోగించిన వస్తువులు, కళాఖండాలు, వస్త్రాలు, వంట సామగ్రి భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు.