వైఎస్సార్ కాపు నేస్తం.. వారి ఖాతాల్లోకి రూ. 15 వేలు జమకు రంగం సిద్ధం..

మహిళల కోసం మరో వినూత్న పథకం 'వైఎస్సార్ కాపు నేస్తం'కు ఏపీ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ పధకం ద్వారా అర్హులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది.

వైఎస్సార్ కాపు నేస్తం.. వారి ఖాతాల్లోకి రూ. 15 వేలు జమకు రంగం సిద్ధం..
Follow us

|

Updated on: Jun 24, 2020 | 9:27 AM

అసలే కరోనా కాలం.. ఆపై ఆర్ధిక సంక్షోభం.. అయినా కూడా జగన్ సర్కార్ వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తోంది. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందడుగు వేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ తాజాగా మహిళల కోసం మరో వినూత్న పథకం ‘వైఎస్సార్ కాపు నేస్తం’కు శ్రీకారం చుట్టారు.

ఈ పధకం ద్వారా అర్హులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 45-60 వయసున్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రూ. 15 వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ. 75 వేల ఆర్ధిక సహాయం అందించనుంది. ఈ పధకాన్ని ఇవాళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్నారు. తొలి ఏడాదికి గానూ దాదాపు 2.36 లక్షల మహిళలకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి రూ. 15 వేల చొప్పున సుమారు రూ. 354 కోట్లను జమ చేయనున్నారు. కాగా, ఈ పధకం లబ్దిదారులను గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఎంపిక చేసింది.

అర్హులు ఎవరంటే…

  • గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు.. అలాగే పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ12. వేలు ఆదాయం కలిగి ఉన్నవారు అర్హులు
  • కుటుంబానికి 3 ఎకరాల్లోపు మాగాణి/ 10 ఎకరాల్లోపు మెట్ట భూమి లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉండాలి.
  • కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తుంటే.. వారు అనర్హులు.
  • 45-60 వయసు ఉన్న వారు అర్హులు..
  • కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు( ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు)
  • కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటున్నా అనర్హులు.