ఏపీకి హోదానే సంజీవని…నీతి ఆయోగ్‌ మీటింగ్‌లో సీఎం జగన్

|

Jun 15, 2019 | 7:07 PM

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై వాణిని గట్టిగా వినిపించిన జగన్..అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే రూట్‌లో ముందుకెళ్తున్నారు. తాజగా కేంద్ర హోమంత్రి అమిత్ షాను కలిసి ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించిన జగన్..ప్రధాని ఒప్పించే దిశగా ప్రయత్నాలు చేయాలని కోరారు.  నేడు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశంలో ప్రసగించిన ఆయన ప్రత్యేక హోదాపై వాయిస్ గట్టిగా వినిపించారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీని ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. విభజనతో ఏపీ తీవ్రంగా […]

ఏపీకి హోదానే సంజీవని...నీతి ఆయోగ్‌ మీటింగ్‌లో సీఎం జగన్
Follow us on

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై వాణిని గట్టిగా వినిపించిన జగన్..అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే రూట్‌లో ముందుకెళ్తున్నారు. తాజగా కేంద్ర హోమంత్రి అమిత్ షాను కలిసి ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించిన జగన్..ప్రధాని ఒప్పించే దిశగా ప్రయత్నాలు చేయాలని కోరారు.  నేడు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశంలో ప్రసగించిన ఆయన ప్రత్యేక హోదాపై వాయిస్ గట్టిగా వినిపించారు.

ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీని ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని…ఆ నష్టాన్ని పూడ్చాలంటే హోదా రావాల్సిందేనని స్పష్టంచేశారు. ఏపీ ఆర్థిక స్థితిగతులతో పాటు రెవెన్యూ లోటు భర్తీ, ప్రత్యేక హోదా ఆవశ్యకతకు సంబంధించి నివేదిక సమర్పించారు ఏపీ సీఎం. అంతేకాదు ఏపీకి ప్రత్యే​క హోదా ఇస్తూ గత కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం కాపీని అందజేశారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నీతి ఆయోగ్ పాలకమండలికి విజ్ఞప్తి చేశారు జగన్.