జులై నుంచి సీఎం జగన్‌ ప్రజాదర్బార్‌

అమరావతి: ప్రజల్ని నేరుగా కలిసేందుకు ఏపీ సీఎం జగన్‌ ‘ప్రజా దర్బార్‌’కు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రోజూ ఉదయం అరగంటపాటు సీఎం జగన్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చే అవకాశమున్నందున దీనికి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే ప్రజా దర్బార్ నిర్వహించి..ప్రజల […]

జులై నుంచి సీఎం జగన్‌ ప్రజాదర్బార్‌

Updated on: Jun 12, 2019 | 8:27 PM

అమరావతి: ప్రజల్ని నేరుగా కలిసేందుకు ఏపీ సీఎం జగన్‌ ‘ప్రజా దర్బార్‌’కు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రోజూ ఉదయం అరగంటపాటు సీఎం జగన్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చే అవకాశమున్నందున దీనికి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే ప్రజా దర్బార్ నిర్వహించి..ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునేవారు. తండ్రి బాటలోనే జగన్ ప్రయాణించడం విశేషం.