అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

|

Nov 10, 2020 | 7:56 AM

అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. తాజాగా రూ.20 వేల లోపు డిపాజిట్లు చేసిన వారికి చెక్కులు పంపిణీ చేసేందుకు..

అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..
Follow us on

Cheques To Agrigold Depositors: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే  10 వేల లోపు ఉన్న డిపాజిటర్లకు మొదటి విడతగా రూ. 263.99 కోట్లు చెల్లింపులు జరిపిన జగన్ సర్కార్.. తాజాగా రూ.20 వేల లోపు డిపాజిట్లు చేసిన వారికి చెక్కులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ అంశంపై ఇటీవల తెలంగాణ హైకోర్టు అనుమతులు ఇవ్వడంతో మరోసారి చెల్లింపులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది.

డిపాజిట్‌దారుల వివరాలను గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా సీఐడీ సేకరిస్తుందని.. వాటిని సీఐడీ డీఎస్పీ, ఆర్దీవోలు పరిశీలిస్తారని ఏజీ శ్రీరామ్ తెలంగాణ హైకోర్టుకు వివరించారు. అలాగే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చేత దరఖాస్తులను ధృవీకరించి.. కలెక్టరేట్ ద్వారా అర్హులైన డిపాజిటర్ల ఖాతాల్లోకి డబ్బును జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం కోర్టుకు వివరించింది. కాగా, మార్చి 31 కల్లా డబ్బు చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు తెలిపింది.

Also Read: ఏపీ ప్రభుత్వం తీపికబురు.. ఇకపై రాష్ట్రమంతా ఆరోగ్యశ్రీ..