భర్తకు దిష్టి తీసి పంపించిన భార్య భువనేశ్వరి

| Edited By:

Mar 16, 2019 | 11:41 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి మొదలయ్యింది. అందరికంటే ముందగా ఏపీలో టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసి.. ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. అయితే.. ఈ ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద చంద్రబాబుకు ఆయన భార్య భువనేశ్వరి కొబ్బరికాయతో దిష్టి తీశారు. ఎదురుగా వచ్చి ఎన్నికల ప్రచారానికి సాగనంపారు. కాగా.. చంద్రబాబు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్‌లో ఆయన తిరుపతికి బయలుదేరారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన సాయంత్రం శ్రీకాకుళంలోని బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేసి […]

భర్తకు దిష్టి తీసి పంపించిన భార్య భువనేశ్వరి
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి మొదలయ్యింది. అందరికంటే ముందగా ఏపీలో టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసి.. ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. అయితే.. ఈ ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద చంద్రబాబుకు ఆయన భార్య భువనేశ్వరి కొబ్బరికాయతో దిష్టి తీశారు. ఎదురుగా వచ్చి ఎన్నికల ప్రచారానికి సాగనంపారు. కాగా.. చంద్రబాబు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్‌లో ఆయన తిరుపతికి బయలుదేరారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన సాయంత్రం శ్రీకాకుళంలోని బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేసి ఆదివారం విజయనగరంలో పర్యటించనున్నారు.