
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద సీఎం చంద్రబాబు నిరసన చేపట్టారు. వినూత్నంగా.. ఐటీ దాడులకు నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి విజ్ఞాపన పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విభజన హామీలు నెరవేర్చకుండా మా పైనే ఎదురుదాడి చేస్తున్నారన్నారు. మోడీ రాక్షస పాలనకు ఇది పరాకాష్ట. మోడీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. ఏక పక్ష దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పథకం ప్రకారమే జగన్ హైదరాబాద్ నుంచి కుట్రలకు రూపకల్పన చేస్తున్నారని అన్నారు. కావాలనే.. ఏపీలో పెద్ద ఎత్తున ఐటీ దాడులు చేస్తున్నారు. అలాగే.. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న.. తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా ఐటీ దాడులను చేయిస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని.. ప్రజాస్వామ్యా వ్యవస్థలను కాపాడాలన్నారు చంద్రబాబు.
Andhra Pradesh CM N Chandrababu Naidu on a sit-in protest in Vijayawada over reported IT raids on TDP candidates and supporters. pic.twitter.com/GP0fmppVRA
— ANI (@ANI) April 5, 2019