Godavari Boat Accident : మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా

|

Sep 16, 2019 | 3:01 AM

తూర్పుగోదావరి జిల్లా కచలూరు వద్ద గోదావరి నదిలో బోటు ప్రమాదం మరణాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పడవ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. వెంటనే సహాయకచర్యల్లో పాల్గొనాల్సిందిగా మంత్రి పువ్వాడ అజయ్‌ను ఆదేశించారు. మరోవైపు బోటు ప్రమాదంపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ మంత్రి కన్నబాబుకు కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. వీలైనంత సాయం చేయాల్సిందిగా కోరారు. దీంతోపాటు హుటాహుటిన వెళ్లి మృతుల కుటుంబాలకు […]

Godavari Boat Accident : మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా
Andhra Pradesh Boat Mishap: 12 Drown, Several Missing; KCR, Jagan Announce Ex-gratia For Victims’ Kin
Follow us on

తూర్పుగోదావరి జిల్లా కచలూరు వద్ద గోదావరి నదిలో బోటు ప్రమాదం మరణాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పడవ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. వెంటనే సహాయకచర్యల్లో పాల్గొనాల్సిందిగా మంత్రి పువ్వాడ అజయ్‌ను ఆదేశించారు.

మరోవైపు బోటు ప్రమాదంపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ మంత్రి కన్నబాబుకు కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. వీలైనంత సాయం చేయాల్సిందిగా కోరారు. దీంతోపాటు హుటాహుటిన వెళ్లి మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని, అంత్య క్రియలు, ఇతరత్రా కార్యక్రమాలలోనూ పాల్గొనాలని మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను సీఎం కేసీఆర్ కోరారు.

దీంతో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఏపీ మంత్రి కన్నబాబుతో ఫోన్లో మాట్లాడారు.  వరంగల్ జిల్లాకు చెందినవారు లాంచీలో ఉన్నారన్ సమాచారం రావడంతో ఆ మేరకు ఆరా తీశారు. వెంటనే ప్రమాద స్థలికి వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనవాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రమాదం జరిగిన బోటులో  తెలంగాణకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు నుంచి 22 మంది, వరంగల్‌కు చెందిన 9 మంది పర్యాటకులు పాపికొండలు విహారయాత్రకు వెళ్లినట్లు సమాచారం. వరంగల్‌ నుంచి గొర్రె ప్రభాకర్‌ ఆధ్వర్యంలో 14 మంది వెళ్లారు. వరంగల్‌కు చెందిన వారిలో గొర్రె ప్రభాకర్‌ సహా ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మరోవైపు హైదరాబాద్‌ పర్యాటకుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన దేవీపట్నం మండలం కచులూరు మందం వద్ద ఏపీ ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి.