దుబ్బాక గెలుపుతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సంబురాలు

|

Nov 10, 2020 | 4:31 PM

దుబ్బాక ఉపఎన్నికలో కారు జోరుకు కళ్లెం వేస్తూ బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. 1,118 ఓట్ల మెజార్టీతో సంచలన విజయం నమోదు కావడంతో తెలంగాణ బీజేపీ నేతలు సంబురాల్లో మునిగిపోయారు.

దుబ్బాక గెలుపుతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సంబురాలు
Follow us on

దుబ్బాక ఉపఎన్నికలో కారు జోరుకు కళ్లెం వేస్తూ బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. 1,118 ఓట్ల మెజార్టీతో సంచలన విజయం నమోదు కావడంతో తెలంగాణ బీజేపీ నేతలు సంబురాల్లో మునిగిపోయారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంతో హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు. బాణాసంచా కాల్చి, డోలు బాజాలు మోగించి కార్యకర్తలు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు.

దుబ్బాక విజయం అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. దుబ్బాక ఓటర్లు చైతన్యపరులని కొనియాడారు. బీజేపీ విజయ పరంపర కొనసాగుతుందని దీమా వ్యక్తం చేశారు. కాగా, దుబ్బాక సాధించిన విజయాన్ని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త శ్రీనివాస్‌కు అంకితం ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ లోనూ బీజేపీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వీర్రాజు ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ వేడుకల్లో మునిగిపోయారు.