సృజనాత్మకత ఉన్నవారే దర్శకులు.. నటనా కౌశల్యం ఉన్నవారే నటులు అనేది నిజం.. అయితే ఈ రెండింటిలో ప్రవేశం ఉన్నవారు మనకు సినిమా ప్రపంచంలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అందులోనూ రెండు పాత్రల్లోనూ సక్సెస్ అవడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే రెండు వేరు వేరు అంశాలు. ఒకటి తెరముందు కనిపిస్తే… మరొకటి తెర వెనుక కదిలే పాత్ర.
అయితే ఈ రెండింటిలో అంతా తెరముందు ప్రేక్షకులకు కనిపించి మెప్పించడంలో సెక్సెస్‌ను వెతుకుంటారు. అయితే ప్రేమమ్ చిత్రంతో అందరిని మెప్పించిన మళయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు ఈ రెండింటిలో తనదైన టాలెంట్‌ను ప్రదర్శిస్తోంది.
ఈ అమ్మడు తాను కథానాయికగా నటిస్తున్న ‘మణియారాయిలే అశోకన్’ అనే మలయాళ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. నటనలో ఎంతగా జీవిస్తుందో.. అంతే స్థాయిలో సహ దర్శకురాలిగా పనిచేస్తోంది. ఇదే అంశంపై అనుపమ మాట్లాడుతూ ‘స్వతహాగా నాకు దర్శకత్వంపై ఇష్టం ఉంది. కానీ హీరోయిన్‌గా బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. అందుకే ఈ సినిమాకు వచ్చిన అవకాశాన్నిఇలా వినియోగించుకుంటున్నా. నా దృష్టిలో స్క్రీన్‌పై కనిపించే అద్భుత దృశ్యం తాలూకు మ్యాజిక్ అంతా తెర వెనకే సృష్టించబడుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడంతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకున్నా. ఎంతో ఇష్టపడి పనిచేశాను కాబట్టి సెట్‌లో ఎప్పుడూ కష్టంగా అనిపించలేదు. నా తొలిచిత్రం ‘ప్రేమమ్’ నుంచి దర్శకత్వ విభాగంలో పనిచేయాలనే కోరిక ఉండేది. ఇప్పుడు ఆ కల నెరవేరింది. భవిష్యత్తులో అవకాశమొస్తే సినిమాకు దర్శకత్వం చేస్తా’ అని ఎంతో ధీమాతో చెప్పింది అందాల తార అనుపమ పరమేశ్వరన్.