
AP Tourism Development: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు జగన్ సర్కార్ పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మరో మూడు ఇంటర్నేషనల్ స్టేడియాలను నిర్మించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. పీపీపీ పద్దతిలో వీటి నిర్మాణాన్ని చేపడతామన్నారు. ఇక వాటిని ఏయే ప్రాంతాల్లో నిర్మించాలనే అంశంపై సీఎం వైఎస్ జగన్‌తో జరిగే సమీక్షా సమావేశం తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అలాగే ఈ నెల 20వ తేదీన నూతన పర్యాటక విధానాన్ని అమలులోకి తీసుకురానున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రాష్ట్రంలోని 12 ప్రాంతాల్లో ఒబెరాయ్ హోటల్ తరహాలో స్టార్ హోటళ్లను నిర్మిస్తామన్నారు. అయితే దీనిపై త్వరలోనే సీఎం జగన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
Also Read:
తెలంగాణలో విస్తరిస్తున్న కొత్త వైరస్.. ఆందోళనలో రైతులు..