రాష్ట్రంలో మరో 10 వేల ఆక్సిజన్‌ పడకలు: ఆరోగ్య శాఖ మంత్రి

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. అయినా, రోజురోజుకు కేసులు భారీగా  నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో 22,500 ఆక్సిజన్ తో కూడిన పడకలు

రాష్ట్రంలో మరో 10 వేల ఆక్సిజన్‌ పడకలు: ఆరోగ్య శాఖ మంత్రి

Edited By:

Updated on: Jul 26, 2020 | 12:14 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. అయినా, రోజురోజుకు కేసులు భారీగా  నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో 22,500 ఆక్సిజన్ తో కూడిన పడకలు అందుబాటులో ఉండగా.. మరో 10 వేల పడకల్ని సిద్ధం చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. కోవిడ్‌ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.200 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ప్రతి రోజు కోవిడ్‌ పరీక్షల కోసం రూ.5 కోట్లు , క్వారంటైన్‌ కేంద్రాల్లో భోజనం, పారిశుధ్యం కోసం 1.5 కోట్ల వ్యయమవుతోందని వివరించారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో అత్యవసర మందులు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

Read More:

ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. అందుబాటులో.. 54 రకాల ఔషధాలు..

కరోనా బాధితుల కోసం.. నిరంతర సేవలో.. 216 అంబులెన్సులు..