పండుగవేళ గరికపాడు చెక్ పోస్టు దగ్గర పాట్లు

| Edited By: Pardhasaradhi Peri

Oct 25, 2020 | 3:30 PM

ఆంధ్ర, తెలంగాణ బోర్డర్ అయిన కృష్ణాజిల్లా గరికపాడు చెక్ పోస్టు దగ్గర పండుగ రోజు ప్రయాణికులు ఇక్కట్ల పాలవుతున్నారు. తెలుగురాష్ట్రాల ఆర్టీసి చర్చల్లో ప్రతిష్టంభన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల లేక ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. అరకొరగా సరిహద్దుల దగ్గర ఆర్టీసీ బస్సులను ఇరు ప్రభుత్వాలు ఏర్పాటుచేసినప్పటికీ, రెండు రాష్ట్రాల సరిహద్దు వద్ద బస్సులు మారటానికి ప్రయాణీకులు ఇష్టపడ్డం లేదు. మరోవైపు, ఇద్దరు.. ముగ్గురు కోసం బస్సులు నడపలేమని బస్సు ఫుల్ అయిన […]

పండుగవేళ గరికపాడు చెక్ పోస్టు దగ్గర పాట్లు
Follow us on

ఆంధ్ర, తెలంగాణ బోర్డర్ అయిన కృష్ణాజిల్లా గరికపాడు చెక్ పోస్టు దగ్గర పండుగ రోజు ప్రయాణికులు ఇక్కట్ల పాలవుతున్నారు. తెలుగురాష్ట్రాల ఆర్టీసి చర్చల్లో ప్రతిష్టంభన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల లేక ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. అరకొరగా సరిహద్దుల దగ్గర ఆర్టీసీ బస్సులను ఇరు ప్రభుత్వాలు ఏర్పాటుచేసినప్పటికీ, రెండు రాష్ట్రాల సరిహద్దు వద్ద బస్సులు మారటానికి ప్రయాణీకులు ఇష్టపడ్డం లేదు. మరోవైపు, ఇద్దరు.. ముగ్గురు కోసం బస్సులు నడపలేమని బస్సు ఫుల్ అయిన తర్వాతే గమ్యానికి చేరుస్తామని బస్సు డ్రైవర్, కండక్టర్ చెబుతుండటంతో ప్రజలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది. దీంతో తెలుగు రాష్ట్రాల సరిహద్దుల వద్ద బ్రేక్ డౌన్ పై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.