వరుస అల్పపీడన ప్రభావాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతోంది. పది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, రేపట్నుంచి కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలియజేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలోని ఉత్తర కోస్తా, యానాంలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే గోదావరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
అలాగే దక్షిణ కోస్తాలో కూడా ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వివరించింది. రాయలసీమలో బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పింది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర తీర ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
#WeatherAlert
Due to LPA formation in North Bay, heavy to very heavy rains likely for next 24 hours in #Odisha, #WestBengal, #Jharkhand, parts of North AP coasts. @Rajani_Weather @lovelyweather_ @weatherindiaoff #Monsoon2020 #Alert pic.twitter.com/pxMYgpoDI1— Weather@Chennai (@saran_2016) August 19, 2020