ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 43,006 శాంపిళ్లను టెస్ట్ చేయగా…316 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 872288కు చేరింది. వైరస్ కారణంగా కొత్తగా ఐదుగురు ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7,038కి చేరింది. గడిచిన 24 గంటల్లో 595 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 859624 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5626 యాక్టీవ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 1,04,53,618 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. కొత్తగా నమోదైన మరణాల పరిశీలిస్తే.. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, కడప, విశాఖ జిల్లాల్లో ఒకరు చొప్పున మృతిచెందారు.
#COVIDUpdates: 07/12/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,69,393 పాజిటివ్ కేసు లకు గాను
*8,56,729 మంది డిశ్చార్జ్ కాగా
*7,038 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,626#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/0XSp1gkvMp— ArogyaAndhra (@ArogyaAndhra) December 7, 2020