Anchor Sameera Exit In Adirindi Show: అందంగా లేనేమో.. అందుకే తప్పించారేమో.. సమీరా కామెంట్!

|

Mar 03, 2020 | 2:02 PM

Anchor Exit In Adirindi Show: మెగా బ్రదర్ నాగబాబు జడ్జ్‌గా వ్యవహరిస్తున్న ‘అదిరింది’ కామెడీ షో నుంచి యాంకర్ సమీరా తప్పుకున్న సంగతి తెలిసిందే. కారణం ఏంటన్న దానిపై క్లారిటీ లేదు గానీ ఈ షోలో యాంకర్ రవి, బిగ్ బాస్ ఫామ్ భానుశ్రీ కొత్త యాంకర్లుగా వచ్చి చేరారు. వారితో షూట్ చేసిన ప్రోమోను కూడా ఇటీవలే యూనిట్ విడుదల చేసింది. ఇక యాంకర్ సమీరా ఎందుకు తప్పుకుందన్న దానిపై సోషల్ మీడియాలో చాలానే […]

Anchor Sameera Exit In Adirindi Show: అందంగా లేనేమో.. అందుకే తప్పించారేమో.. సమీరా కామెంట్!
Follow us on

Anchor Exit In Adirindi Show: మెగా బ్రదర్ నాగబాబు జడ్జ్‌గా వ్యవహరిస్తున్న ‘అదిరింది’ కామెడీ షో నుంచి యాంకర్ సమీరా తప్పుకున్న సంగతి తెలిసిందే. కారణం ఏంటన్న దానిపై క్లారిటీ లేదు గానీ ఈ షోలో యాంకర్ రవి, బిగ్ బాస్ ఫామ్ భానుశ్రీ కొత్త యాంకర్లుగా వచ్చి చేరారు. వారితో షూట్ చేసిన ప్రోమోను కూడా ఇటీవలే యూనిట్ విడుదల చేసింది. ఇక యాంకర్ సమీరా ఎందుకు తప్పుకుందన్న దానిపై సోషల్ మీడియాలో చాలానే రూమర్స్ వస్తున్నాయి. ఆమె ప్రెగ్నెంట్ అని కొందరు చెబుతుంటే.. మరికొందరు ఆమెకు పది ఎపిసోడ్లకే ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ యాంకర్ సమీరా రీసెంట్‌గా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియో చేసి రూమర్లపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. ‘అదిరింది షో నుంచి ఎందుకు తప్పుకున్నారని.. ఈ వీక్ ప్రోమోలో మీరు ఎందుకు లేరని చాలామంది మెసేజ్‌లు, ఫోన్‌లు చేస్తున్నారు. నా అంతటి నేను షో నుంచి తప్పుకోలేదు. వాళ్లే తీసేశారు. ఈ విషయాన్ని ప్రొడక్షన్ వాళ్లు కూడా చెప్పలేదు. మీడియా ద్వారానే తెలిసింది. ఎప్పటినుంచో యాంకర్‌ను మార్చాలని అనుకున్నారు. ఇక ఇదే సరైన సమయం అనుకుని మార్చారు. నా స్థానంలో ఎవరిని తీసుకున్నారని కూడా అడగలేదు. కొత్త ప్రోమో లింక్‌ను కూడా ఎవరో పంపితేనే చూశాను’ అని అన్నారు.

‘నన్ను మార్చడంపై కూడా సరైన కారణాన్ని యూనిట్ చెప్పలేదన్నారు. బహుశా వారికి ఇంకా అందమైన యాంకర్ కావాలేమో అని ఆమె అన్నారు. అటు నేను ప్రెగ్నెంట్ అని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని కొట్టిపారేశారు. అంతేకాక కేవలం 10 ఎపిసోడ్లకే ఒప్పుకున్నానని ఊహాగానాలు వినిపిస్తున్నాయని… తాను 26 ఎపిసోడ్లకు కాంట్రాక్టుపై సంతకం చేశానని చెప్పారు. ఇక కొత్తగా షోకు హోస్టుగా వచ్చిన యాంకర్ రవి, భానుశ్రీలకు సమీరా శుభాకాంక్షలను తెలిపారు. ఇప్పుడు ‘అదిరింది’ నుంచి తప్పుకున్నా.. త్వరలోనే శుభవార్తతో మీ ముందుకు వస్తానని చెబుతూ ఆమె ఈ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

For More News:

హైదరాబాద్‌లో ఇంటి వద్దకే భోజనం.. కేవలం రూ.5 మాత్రమే.!

రైళ్లలో రేప్‌లు.. విస్తుపోయే నిజాలు.!

కోహ్లీ దురుసుతనాన్ని భూతద్ధంలో పెట్టి చూడలేం.. విలియమ్సన్‌

రౌడీగారు.. మరీ ఇంత నాటీనా.?

మహేష్ బాబు వీరాభిమాని మృతి.. కారణమిదేనా.?

టెస్ట్ ఛాంపియన్‌షిప్.. కోహ్లీసేనకు ముందుంది ముసళ్ల పండగ..!

మీకు ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉందా.? అయితే ఇది మీకోసమే.?

మృతి చెందిన టీచర్ ‘సస్పెన్షన్’.. బీహార్ విద్యాశాఖ నిర్వాకం.!