Bihar Teacher Suspension: మృతి చెందిన టీచర్ ‘సస్పెన్షన్’.. బీహార్ విద్యాశాఖ నిర్వాకం.! 

Bihar Teacher Suspend: బీహార్‌లో ఓ చిత్రమైన విషయం వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం చనిపోయిన ఓ ఉపాధ్యాయుడిపై విద్యాశాఖ అధికారులు సస్పెన్షన్ వేటు వేయడం సంచలనానికి దారి తీసింది. పరీక్ష పేపర్లు దిద్దేందుకు అతడు హాజరు కాలేదని అతడ్ని సస్పెండ్ చేస్తూ నోటీసులను పంపించారట. తీరా అతను చనిపోయినట్లు తెలిసేసరికి అధికారులు నాలుక కరుచుకున్నారు. ఇక విద్యాశాఖ అధికారుల తీరుపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమ బద్దీకరించాలంటూ […]

Bihar Teacher Suspension: మృతి చెందిన టీచర్ 'సస్పెన్షన్'.. బీహార్ విద్యాశాఖ నిర్వాకం.! 
Follow us

|

Updated on: Mar 03, 2020 | 1:57 PM

Bihar Teacher Suspend: బీహార్‌లో ఓ చిత్రమైన విషయం వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం చనిపోయిన ఓ ఉపాధ్యాయుడిపై విద్యాశాఖ అధికారులు సస్పెన్షన్ వేటు వేయడం సంచలనానికి దారి తీసింది. పరీక్ష పేపర్లు దిద్దేందుకు అతడు హాజరు కాలేదని అతడ్ని సస్పెండ్ చేస్తూ నోటీసులను పంపించారట. తీరా అతను చనిపోయినట్లు తెలిసేసరికి అధికారులు నాలుక కరుచుకున్నారు. ఇక విద్యాశాఖ అధికారుల తీరుపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమ బద్దీకరించాలంటూ గత నెల 17న ఉద్యోగులు ఆందోళన చేపట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే పరీక్ష పేపర్లు దిద్దేందుకు వెళ్లిన ప్రభుత్వ టీచర్లను కూడా వారు అడ్డుకోవడం జరిగింది. ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యాశాఖ విధుల్లోకి రానివారిపై చర్యలు చేపట్టింది. వారిని సస్పెండ్ చేస్తూ ఫిబ్రవరి 28న నోటీసులు పంపారు.

ఇక్కడే ఆ విచిత్రమైన అంశం బయటపడింది. రంజిత్ కుమార్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు బెగుసరై‌లోని ఓ కేంద్రంలో పేపర్లు దిద్దాల్సి ఉంది. అయితే అతడు హాజరు కాలేదు. ఇది గుర్తించిన విద్యాశాఖ అధికారులు అతడ్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నోటీసులు చూసిన తోటి ఉపాధ్యాయులు రంజిత్ రెండేళ్ల క్రితమే చనిపోయాడని.. ఇన్ని రోజులు రాకపోయినా ఈ విషయాన్ని ఇంకా గుర్తించలేదా అని అధికారులను ప్రశ్నించారు. దీనితో అధికారుల నిర్లక్ష్యపు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

For More News:

హైదరాబాద్‌లో ఇంటి వద్దకే భోజనం.. కేవలం రూ.5 మాత్రమే.!

రైళ్లలో రేప్‌లు.. విస్తుపోయే నిజాలు.!

అందంగా లేనేమో.. అందుకే తప్పించారేమో.. సమీరా కామెంట్!

కోహ్లీ దురుసుతనాన్ని భూతద్ధంలో పెట్టి చూడలేం.. విలియమ్సన్‌

రౌడీగారు.. మరీ ఇంత నాటీనా.?

మహేష్ బాబు వీరాభిమాని మృతి.. కారణమిదేనా.?

టెస్ట్ ఛాంపియన్‌షిప్.. కోహ్లీసేనకు ముందుంది ముసళ్ల పండగ..!

మీకు ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉందా.? అయితే ఇది మీకోసమే.?