బెట్టింగ్ కారణంగా అప్పులు..ఒత్తిడి భరించలేక ఆత్మహత్య..కుమార్తెను క్రికెటర్ చేయాలని ఆఖరి కోరిక

|

Dec 12, 2020 | 4:11 PM

యువత బెట్టింగుల మాయలో చిక్కుకుపోతుంది. మితిమీరిపోయిన అప్పులను ఎలా తీర్చాలో తెలియక...అర్థాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు యువకులు.

బెట్టింగ్ కారణంగా అప్పులు..ఒత్తిడి భరించలేక ఆత్మహత్య..కుమార్తెను క్రికెటర్ చేయాలని ఆఖరి కోరిక
Follow us on

యువత బెట్టింగుల మాయలో చిక్కుకుపోతుంది. మితిమీరిపోయిన అప్పులను ఎలా తీర్చాలో తెలియక…అర్థాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు యువకులు. తాజాగా మరో యువకుడు బెట్టింగ్ భూతానికి బలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..కర్నూలు శివారు గుత్తి పెట్రోల్ ‌బంకు దగ్గర్లో ఓ హోటల్‌ వెనుక కమ్మరి మహానందయ్య (30) అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. అనంతపురం జిల్లా పామిడి మండలం సి.రామరాజుపల్లికి చెందిన మహానందయ్యతో డోన్‌కు చెందిన యువతితో నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఒక కూతురు ఉంది. మహానందయ్య గుత్తిలో బట్టల షాపు నిర్వహిస్తున్నాడు. నష్టాల కారణంగా వ్యాపారం దివాలా తీసింది. దీంతో ఈజీ మనీపై అతడి మనసు మళ్లింది. డబ్బులు సంపాదించేందుకు జూదం, క్రికెట్‌ బెట్టింగులకు అలవాటుపడ్డాడు. రూ.లక్షల్లో అప్పులు చేసి తీర్చలేకపోయాడు. అప్పులు ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో.. చెక్కులు, ప్రామిసరీ నోట్లు రాసిచ్చాడు.

ఇటీవల భార్య కాన్పు కోసం ఆమె తల్లిగారింటికి వెళ్లగా తాను కూడా డోన్‌కు వచ్చి బేకరీలో పనికి కుదిరాడు. గురువారం సాయంత్రం భార్యకు ఫోన్‌ చేసి తాను కర్నూలు వచ్చానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినప్పటికీ ఆచూకీ తెలియలేదు. ఇంతలోనే.. శుక్రవారం ఉదయం కర్నూలు శివారులో మహానందయ్య నిర్జీవంగా కనిపించాడు. కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగినట్లు పోలీసులు గుర్తించారు. అప్పులు ఇచ్చిన వాళ్ల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. తల్లిదండ్రులు, భార్య తనను క్షమించాలని.. ఎవరూ క్రికెట్‌ బెట్టింగ్‌ జోలికి వెళ్లొద్దని అందులో రాశాడు. కుమార్తె క్రికెటర్‌ కావాలని అతడు కోరడం కొసమెరుపు.

Also Read : 

ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం, బాంబులా పేలిన రియాక్టర్

Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ ఫినాలేకు అతిథి మహేశ్ కాదట..’మాస్ కా బాప్’ రాబోతున్నారట !

నెల్లూరు జిల్లా వెలుగొట్లపల్లిలో పొలంలో నాట్లు వేస్తున్న ఆరుగురు కూలీలకు అస్వస్థత..ఒకరు మృతి