విషాదం..కూతుళ్లకు పెళ్లి చేసే స్తోమత లేక తండ్రి ఆత్మహత్య

కూతుళ్లకు పెళ్లి చేసే ఆర్థిక స్తోమత లేదన్న బాధ‌తో ఓ తండ్రి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన విషాద‌ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసు‌కుంది.

విషాదం..కూతుళ్లకు పెళ్లి చేసే స్తోమత లేక తండ్రి ఆత్మహత్య

Updated on: Jul 12, 2020 | 4:57 PM

కూతుళ్లకు పెళ్లి చేసే ఆర్థిక స్తోమత లేదన్న బాధ‌తో ఓ తండ్రి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన విషాద‌ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసు‌కుంది. ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి తండాకి చెదిన సురేంద్ర నాయ‌క్ కు ఐదుగురు కూతుర్లు ఉన్నారు. ఆర్థిక ప‌రిస్థితి బాగో‌లేక‌పోవ‌డంతో..వారిలో ఇద్ద‌రికి అప్పు చేసి ఎలానో పెళ్లిళ్లు చేశాడు. అప్పులు త‌ల‌కు మించిన భారం అవ్వ‌డం.. మిగిలిన ముగ్గురి కూతుర్లు పెళ్లికి ఎద‌గ‌డంతో..ఏం చేయాలో పాలుపోక త‌నువు చాలించాడు.

గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకున్న అత‌డిని… స్థానికులు గ‌మ‌నించి హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే చనిపోయినట్లు డాక్ట‌ర్లు నిర్ధారించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us