
‘బాలికే భవిష్యత్తు’ పేరుతో వినూత్న కార్యక్రమానికి అనంతపురం జిల్లా కలెక్టర్ శ్రీకారం చుట్టారు. ఇవాళ 11 గంటల సమయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులుగా బాలికలు బాధ్యతలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌గా శ్రావణి బాధ్యతలు చేపట్టగా, జాయింట్ కలెక్టర్ గా మధుశ్రీ బాధ్యతలు చేపట్టారు. బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన బాలికలకు ఈ అపురూపమైన అవకాశం కల్పించినట్టు కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. అక్టోబర్ 11 వ తేదీన ప్రతి కార్యాలయంలో ఒక రోజు కార్యాలయపు అధికారిగా బాలికకు పదవీ అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.