Viral Video: బాలీవుడ్ స్టార్ ను ఆంకుల్ అని పిలిచిన అనంత్ అంబానీ భార్య.. వీడియో వైరల్

ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మార్చి 1 నుంచి మార్చి 3 వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుక మార్చి 6న మరో కార్యక్రమంలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్ వంటి బాలీవుడ్ స్టార్లు పాల్గొన్నారు.

Viral Video: బాలీవుడ్ స్టార్ ను ఆంకుల్ అని పిలిచిన అనంత్ అంబానీ భార్య.. వీడియో వైరల్
Radhika Marchant

Updated on: Mar 08, 2024 | 4:41 PM

ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మార్చి 1 నుంచి మార్చి 3 వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుక మార్చి 6న మరో కార్యక్రమంలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్ వంటి బాలీవుడ్ స్టార్లు పాల్గొన్నారు. రాధికా మర్చంట్ స్టేజ్ పై షారుఖ్ ఖాన్ తో సరదాగా గడిపిన మధుర క్షణాలు, ఈ వేడుకకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే బాలీవుడ్ బాద్షా ను ‘అంకుల్’ అని పిలిచిన రాధిక షారుఖ్ ఐకానిక్ డైలాగుల్లో ఒకటి చెప్పి నెటిజన్స్ ను ఆశ్చర్యపర్చింది.

‘షారుఖ్ అంకుల్..’ అని రాధిక చెప్పడంతో వీడియో మొదలవుతుంది. “మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఆజ్ ఆప్కీ సినిమా కా ఏక్ డైలాగ్ బోల్ దేతి హున్ (నేను మీ సినిమాలోని ఒక డైలాగ్ చెబుతాను)” అని ఆమె అంటుంది. ‘అగర్ అక్షయ్ హోతా తో అక్షయ్ కుమార్ కీ ఫిల్మ్ కా బోల్టీ (అక్షయ్ ఇక్కడ ఉంటే, మీరు అతని సినిమాలోని ఒక డైలాగ్ చెప్పేవారు) అని షారుఖ్ జోక్ చేశాడు. అప్పుడు రాధిక షారుఖ్ అత్యంత ఐకానిక్ డైలాగులలో ఒకటి, “జిత్నీ షిద్దాత్ సే మైనే తుమ్హే పానే కి కోషిష్ కీ హై, జర్రే జరే నే ముజే తుమ్సే మిలానే కి కోషి కీ హై” అని చెప్పింది.

గుజరాత్ లోని జామ్ నగర్ లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మొదటి రోజు రిహానా కచేరీతో పాటు తారల సందడి కనిపించింది. తరువాతి రోజులలో బాలీవుడ్ లెజెండ్స్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అలాగే అంతర్జాతీయ కళాకారులు సందడి చేశారు. కేవలం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసమే రూ.1200 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు అంబానీ దంపతులు. అయితే ప్రస్తుతం రాధిక అంకుల్ అని పిలవడం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అయ్యారు.

Follow Us