కూలిన ఐఏఎఫ్ యుద్ధ విమానం.. 13 మంది మృతి

| Edited By: Srinu

Jun 04, 2019 | 5:09 PM

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్ 32 విమానం.. భారత్- చైనా సరిహద్దులో నిన్న సాయంత్రమే కూలిపోయింది. ఈ విమానంలో ప్రయాణించిన 8 మంది సిబ్బంది, అయిదుగురు ప్రయాణికులు మరణించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఏఐఎఫ్‌కు చెందిన 11 విమానాలు కూలిపోయినట్లు సమాచారం. కాగా నిన్న మధ్యాహ్నం 12.25 గంటలకు అస్సాంలోని జోర్హాత్ నుంచి బయల్దేరిన ఈ విమానం మధ్యాహ్నం 1 గంటకు రేడర్ నుంచి మాయమైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెచుక అడ్వాన్స్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌లో […]

కూలిన ఐఏఎఫ్ యుద్ధ విమానం.. 13 మంది మృతి
Follow us on

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్ 32 విమానం.. భారత్- చైనా సరిహద్దులో నిన్న సాయంత్రమే కూలిపోయింది. ఈ విమానంలో ప్రయాణించిన 8 మంది సిబ్బంది, అయిదుగురు ప్రయాణికులు మరణించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఏఐఎఫ్‌కు చెందిన 11 విమానాలు కూలిపోయినట్లు సమాచారం.

కాగా నిన్న మధ్యాహ్నం 12.25 గంటలకు అస్సాంలోని జోర్హాత్ నుంచి బయల్దేరిన ఈ విమానం మధ్యాహ్నం 1 గంటకు రేడర్ నుంచి మాయమైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెచుక అడ్వాన్స్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌లో ఈ విమానం దిగాల్సింది.  సమాచారం తెలిసిన వెంటనే విమానాన్ని గాలించేందుకు సుఖోయ్‌ విమానాన్ని ఐఏఎఫ్ రంగంలోకి దింపింది. కొద్ది గంటల సెర్చ్ ఆపరేషన్ తర్వాత సాయంత్రానికి ఏఎన్‌-32 విమాన శకలాలను గుర్తించారు.