‘అమ్మఒడి’ లబ్ధిదారుల ఎంపిక.. నేడే ఆఖరు తేదీ.!

|

Jan 05, 2020 | 11:39 AM

నవరత్నాల్లో భాగమైన ‘అమ్మఒడి’ పథకాన్ని భారీ ఎత్తున అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 42 లక్షల 80 వేల 753 మందిని పథకానికి అర్హులుగా గుర్తించగా.. వారి పేర్ల జాబితాను అన్ని గ్రామాలు,పాఠశాలల్లో పెట్టారు. ఈ పథకం కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6,400 కోట్లు కేటాయించింది. అయితే ఈ మొత్తం మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా, జనవరి 9న చిత్తూరు జిల్లాలో ‘అమ్మఒడి’ పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ […]

అమ్మఒడి లబ్ధిదారుల ఎంపిక.. నేడే ఆఖరు తేదీ.!
Follow us on

నవరత్నాల్లో భాగమైన ‘అమ్మఒడి’ పథకాన్ని భారీ ఎత్తున అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 42 లక్షల 80 వేల 753 మందిని పథకానికి అర్హులుగా గుర్తించగా.. వారి పేర్ల జాబితాను అన్ని గ్రామాలు,పాఠశాలల్లో పెట్టారు. ఈ పథకం కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6,400 కోట్లు కేటాయించింది. అయితే ఈ మొత్తం మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా, జనవరి 9న చిత్తూరు జిల్లాలో ‘అమ్మఒడి’ పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి ప్రతి ఏటా రూ.15 వేలను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పథకం వర్తించాలంటే విద్యార్థులకు హాజరు 75 శాతం ఉండాలి. ఇక ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఎవరైనా నమోదు చేసుకోని వారు ఉంటే.. సంబంధిత అధికారులకు దరఖాస్తు సమర్పించాలని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా లబ్ధిదారుల ఎంపిక కూడా పారదర్శకంగా జరుగుతోందన్నారు. ఈరోజు సాయంత్రం లోపు ఎంతమంది లబ్దిదారులను గుర్తిస్తే అంతమందికీ ఈ పథకం వర్తించనుంది. ముందుగా ఒక్క రూపాయి ఖాతాల్లోకి వేసి.. ఆ తర్వాత ఒకేసారి 9వ తేదీన రూ.15వేలు జమ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.