వర్మ…నీకిదేం ఖర్మ..! సినిమా చూపిస్తోన్న సినిమా..!

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలుసార్లు రిలీజ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో సెన్సార్ బోర్డు ఆఫీసు ఎదుట సినిమాకు సహా నిర్మాణ బాధ్యతలు చూస్తోన్న నట్టికుమార్ ఆందోళనకు దిగారు.  సెన్సార్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వడం లేదంటూ బోర్డు మెంబర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  సెన్సార్ బోర్డు ఆఫీసర్  రాజశేఖర్ గారు సినిమా చూసి రీజనల్ కమిటీకి రిఫర్ చేశారని..వారు అడిగినట్లుగానే కట్స్‌తో కాపీ సబ్మిట్ చేశామని […]

వర్మ...నీకిదేం ఖర్మ..! సినిమా చూపిస్తోన్న సినిమా..!
Follow us

| Edited By:

Updated on: Dec 11, 2019 | 4:22 PM

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలుసార్లు రిలీజ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో సెన్సార్ బోర్డు ఆఫీసు ఎదుట సినిమాకు సహా నిర్మాణ బాధ్యతలు చూస్తోన్న నట్టికుమార్ ఆందోళనకు దిగారు.  సెన్సార్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వడం లేదంటూ బోర్డు మెంబర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  సెన్సార్ బోర్డు ఆఫీసర్  రాజశేఖర్ గారు సినిమా చూసి రీజనల్ కమిటీకి రిఫర్ చేశారని..వారు అడిగినట్లుగానే కట్స్‌తో కాపీ సబ్మిట్ చేశామని పేర్కొన్నారు. అయినా కూడా కావాలనే కక్షపూరితంగా సర్టిఫికేట్‌ను నిలిపివేశారని ఆరోపించారు. 12 తేదీ రిలీజ్ చేయడానికి డేట్ ప్రకటించామని, బీజేపీ నేత సుజనా చౌదరి సినిమాను అడ్డుకుంటున్నారని తెలిపారు.

సినిమా విడుదల అయితే, టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా పోతుందని, అందుకే 50 లక్షలు ఇచ్చి రిలీజ్‌ను ఆపేస్తున్నారని నట్టికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నుంచి కూడా రూ. 50 లక్షలు రాజశేఖర్ డిమాండ్ చేశాడు కానీ తాము ఇచ్చేది లేదని తేల్చి చెప్పామన్నారు.  ఈ రోజు కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో, న్యాయస్థానాలపై తమకు నమ్మకుముందని నట్టికుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

స్పందించిన సెన్సార్ బోర్డు ఆఫీసర్ రాజశేఖర్ :

కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో అమ్మ రాజ్యంలో కడప బిడ్డల చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదని రాజశేఖర్ పేర్కొన్నారు. బుధవారం కోర్టు తీర్పును బట్టి సర్టిఫికేట్ పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  చిత్ర యూనిట్ నుంచి  50 లక్షల డిమాండ్ చేశారన్న ఆరోపణలు ఆయన ఖండించారు. తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిడ్లు లేవని..రూల్స్‌ ప్రకారమే నడుచుకుంటున్నట్లు తెలిపారు.

కోర్టు తీర్పుపై ఉత్కంఠ:

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రానికి సంబంధించి ప్రాథమిక కమిటీ, రివైజింగ్ కమిటీ చేసిన సిఫారసులతో సహా బుధవారం నాటికి రికార్డులు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం సెన్సార్ బోర్డును ఆదేశించింది. డిసెంబర్ 12 న జరగాల్సిన సినిమా విడుదలకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఎం. ఇంద్రసేన చౌదరితో పాటు నగరానికి చెందిన మరొకరు లంచ్ మోషన్లను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాగా నేడు ఈ ఇష్యూపై కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉన్న నేపథ్యంలో సర్వత్వా ఉత్కంఠ నెలకుంది. 

Latest Articles
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..
ఈ దేశంలో 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీలు.. నివాసితులు లేరు..
ఈ దేశంలో 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీలు.. నివాసితులు లేరు..
ధర్మం కోసం యుద్ధం తప్పదు.. హరిహర వీరమల్లు టీజర్..
ధర్మం కోసం యుద్ధం తప్పదు.. హరిహర వీరమల్లు టీజర్..
అమాయకపు చూపుల చిన్నారిని గుర్తుపట్టండి..
అమాయకపు చూపుల చిన్నారిని గుర్తుపట్టండి..
తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడనున్న 6గురు.. లిస్టులో హైదరాబాదీ..
తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడనున్న 6గురు.. లిస్టులో హైదరాబాదీ..
చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఫిదా..! పిల్ల‌ల‌కు ఇలాంటివే
చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఫిదా..! పిల్ల‌ల‌కు ఇలాంటివే
తెలంగాణపై బీజేపీ హైకమాండ్‌ స్పెషల్‌ ఫోకస్.. ఫ్లాన్ ఇదే!
తెలంగాణపై బీజేపీ హైకమాండ్‌ స్పెషల్‌ ఫోకస్.. ఫ్లాన్ ఇదే!
ఉల్లి పకోడీ బోర్ కట్టిందా..గులాబీ పకోడీ తినమంటున్న యువకుడు
ఉల్లి పకోడీ బోర్ కట్టిందా..గులాబీ పకోడీ తినమంటున్న యువకుడు