కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌కు బీజేపీ జాతీయధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీని, భాగస్వామ్య పార్టీలతో సంబంధాలను చిక్కుల్లో పెట్టే విధంగా అనవసర వ్యాఖ్యలు చేయవద్దని.. ఇలాంటి తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని అమిత్ షా కేంద్రమంత్రి గిరిరాజ్‌ను హెచ్చరించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీజేపీ, ఎల్జేపీ నేతలను ఎగతాళి చేస్తూ గిరిరాజ్ సింగ్ ఓ ట్వీట్ చేశారు. అంతేకాదు నితీష్‌తో కలిసి సుశీల్‌కుమార్ మోదీ, రామ్‌విలాస్ పాశ్వాన్, చిరాగ్ పాశ్వాన్ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు. నవరాత్రి ఉత్సవాలను ఇంతే ఉత్సాహంగా ఎందుకు జరుపుకోరంటూ ప్రశ్నించారు.
బీజేపీ, జేడీయూ మధ్య దూరం పెరుగుతున్న తరుణంలో గిరిరాజ్ వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయనే చెప్పాలి. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందని జేడీయూ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ విమర్శించగా.. గిరిరాజ్ మానసిక పరిస్థితి సరిలేదని చిరాగ్ పాశ్వాన్ దుయ్యబట్టారు.
कितनी खूबसूरत तस्वीर होती जब इतनी ही चाहत से नवरात्रि पे फलाहार का आयोजन करते और सुंदर सुदंर फ़ोटो आते??…अपने कर्म धर्म मे हम पिछड़ क्यों जाते और दिखावा में आगे रहते है??? pic.twitter.com/dy7s1UgBgy
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) June 4, 2019