ఏపీ : కష్టకాలంలో గర్భిణికి పురుడుపోసిన 108 అంబులెన్స్ సిబ్బంది..

|

Jul 26, 2020 | 12:40 AM

క‌రోనా వేళ‌ వైద్యసేవలు అందడం క‌స్ట‌త‌రంగా మారింది. ఇలాంటి సంక్షోభ‌ పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సిబ్బంది మేమున్నామంటూ ముందుకు వ‌చ్చి సాయం అందిస్తున్నారు.

ఏపీ : కష్టకాలంలో గర్భిణికి పురుడుపోసిన 108 అంబులెన్స్ సిబ్బంది..
Follow us on

క‌రోనా వేళ‌ వైద్యసేవలు అందడం కష్టత‌రంగా మారింది. ఇలాంటి సంక్షోభ‌ పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సిబ్బంది మేమున్నామంటూ ముందుకు వ‌చ్చి సాయం అందిస్తున్నారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులో నివ‌శించే నిండు గర్భిణికి శనివారం ఒక్క‌సారిగా నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెంది.. సాయం కోసం వెంట‌నే 108 అంబులెన్స్​కు ఫోన్ చేశారు.

వెంటనే స్పందించిన స్టాఫ్ అక్కడికి చేరుకుని తాము చూసుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మ‌హిళ‌ను అంబులెన్స్ లో ఎక్కించుకొని నరసరావుపేట ఆస్ప‌త్రికి బ‌య‌లుదేరారు. అయితే జొన్నలగడ్డ వద్దకు వెళ్ళే సరికి గర్భిణికి నొప్పులు అధిక‌మ‌య్యాయి. ఇది గమనించిన అంబులెన్స్ స్టాఫ్ రమ్యలత వాహనం పక్కన ఆపించి ప్ర‌సవం చేశారు. సాయికుమారికి పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించింది. అనంతరం తల్లి బిడ్డలను క్షేమంగా గ‌వ‌ర్న‌మెంట్ ఆసుపత్రిలో చేర్పించారు. కష్టకాలంలో అండగా నిలిచిన 108 సిబ్బందికి సాయికుమారి కుటుంబ సభ్యులు ధ‌న్యావాదాలు తెలిపారు.