చంద్రబాబు వ్యాఖ్యలకు అంబటి కౌంటర్

|

Apr 12, 2019 | 5:44 PM

విజయవాడ: ఓడిపోతామనే భయంతోనే టీడీపీ నేతలు తమపై దాడులకు పాల్పడ్డారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. తన చుట్టూ కుట్ర జరుగుతోందని చంద్రబాబు నాయడు గారు అనడం విచిత్రంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఈసారి పెరిగిన ఓటింగ్ శాతం.. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తోందని.. టీడీపీ పాలనను ప్రజలు తిరస్కరించబోతున్నారని అంబటి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘కోడెల శివప్రసాదరావుకు నేర చరిత్ర ఉందని.. […]

చంద్రబాబు వ్యాఖ్యలకు అంబటి కౌంటర్
Follow us on

విజయవాడ: ఓడిపోతామనే భయంతోనే టీడీపీ నేతలు తమపై దాడులకు పాల్పడ్డారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. తన చుట్టూ కుట్ర జరుగుతోందని చంద్రబాబు నాయడు గారు అనడం విచిత్రంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఈసారి పెరిగిన ఓటింగ్ శాతం.. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తోందని.. టీడీపీ పాలనను ప్రజలు తిరస్కరించబోతున్నారని అంబటి వ్యాఖ్యానించారు.

శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘కోడెల శివప్రసాదరావుకు నేర చరిత్ర ఉందని.. ఆయన మీద ఎప్పుడూ వైసీపీ నేతలు దాడి చెయ్యరని అంబటి పేర్కొన్నారు. ఇనిమెట్ల గ్రామం వైసీపీకి కంచుకోటని.. అలాంటిది అక్కడ పోలింగ్ బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకోవడాన్ని చూసి ప్రజలు రిగ్గింగ్ చేస్తారనే ఆందోళనతో అడ్డుకొనే ప్రయత్నం చేశారని చెప్పారు.

కోడెలపై దాడికి తనకు సంబంధం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వైసీపీ అభ్యర్థులపై టీడీపీ నేతలు దాడికి దిగారని చెప్పారు. ఏపీలో ఐదేళ్లపాటు చంద్రబాబు పాలనను చూసిన ప్రజలు విసిగిపోయారు. అందుకే ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు.