కరోనా ఎఫెక్ట్: అమర్‌నాథ్ యాత్రకు.. రోజుకు 500 మందికే అనుమతి..

| Edited By:

Jul 05, 2020 | 2:28 AM

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. దీని ప్రభావం అమర్‌నాథ్ యాత్రపై కూడా పడింది. ఈ ఏడాది

కరోనా ఎఫెక్ట్: అమర్‌నాథ్ యాత్రకు.. రోజుకు 500 మందికే అనుమతి..
Follow us on

Five Hundred Pilgrims Per Day in Amarnath Yatra: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. దీని ప్రభావం అమర్‌నాథ్ యాత్రపై కూడా పడింది. ఈ ఏడాది కేవలం రోజుకు 500 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తామని జమ్మూ-కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ బీవీఆర్ సుబ్రహ్మణ్యం శనివారం చెప్పారు. జమ్మూ నుంచి రోజుకు 500 మంది భక్తులు అమర్‌నాథ్‌కు వెళ్ళవచ్చునని తెలిపారు.

కరోనా ప్రభావం నేపథ్యంలో.. జమ్మూ-కశ్మీరులో ప్రవేశించే భక్తులకు కోవిడ్-19 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వర్తిస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సబ్ కమిటీతో అమర్‌నాథ్ యాత్ర కోసం జరుగుతున్న ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ శనివారం చర్చించారు. జమ్మూ-కశ్మీరులో ప్రవేశించే భక్తులు తప్పనిసరిగా కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని, నెగెటివ్ రిపోర్టు వచ్చే వరకు క్వారంటైన్‌లో ఉండాలని తెలిపారు. గతంలో యాత్రికుల శిబిరాలుగా ఉపయోగపడిన భవనాలను ఈ ఏడాది క్వారంటైన్ సెంటర్లుగా ఉపయోగిస్తామని చెప్పారు.