
ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ షిండే ట్రాన్స్ జెండర్ గా మారిపోయారు. దీపికా పదుకోన్, అనుష్క శర్మ, కరీనా కపూర్ వంటి సెలబ్రిటీలకు ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసిన ఈయన.. తన పేరును ‘సైషా’ గా మార్చుకుంటున్నట్టు ప్రకటించారు. నేను గే మ్యాన్ కాదు… కానీ ఇప్పుడు ట్రాన్స్ వుమన్ అని ఈమె పేర్కొన్నారు. ఆరేళ్ళ క్రితం తను పురుషులపట్ల ఆసక్తి చూపేదానినని, కాలేజీ రోజుల్లో అంతా తనను అదోమాదిరిగా చూడడంతో ఎంతో బాధ కలిగేదని సైషా వెల్లడించింది. ఓ రియల్టీలో జీవిస్తున్న ఉక్కిరిబిక్కిరి లైఫ్ లో ఉన్నట్టు ఫీలయ్యేదానిని, దాదాపు 20 ఏళ్ళ వయస్సులో నిఫ్ట్ లో ఉన్నప్పుడు నిజమేమిటో తెలుసుకోగలిగే సాహసం చేశాను, ఆరేళ్ళ క్రితం జరిగిన ఘటనలు అవి.. ఒక్కో సారి ఒక్కో విధంగా ఉన్నట్టు ఫీలవుతూ వచ్చాను..చివరకు నా ధ్యేయమేమిటో తెలిసింది అని వివరించింది.
సైషా అంటే అర్థవంతమైన జీవితమని, అలాగే ‘మీనింగ్ ఫుల్ గా’ బతకాలని అనుకుంటున్నానని ఇప్పుడు ట్రాన్స్ వుమన్ గా మారిపోయిన స్వప్నిల్ షిండే అంటున్నారు. తన ఇదివరకటి ఫోటోలను కూడా సైషా షేర్ చేసింది.