Pushpa Movie: ‘పుష్ప’ మూవీ సూపర్ అప్‏డేట్.. రఫ్ లుక్‏లో అదరగొట్టిన బన్నీ.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే ?

|

Jan 28, 2021 | 1:10 PM

స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మంధన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'పుష్ప'. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో బన్నీ

Pushpa Movie: పుష్ప మూవీ సూపర్ అప్‏డేట్.. రఫ్ లుక్‏లో అదరగొట్టిన బన్నీ.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే ?
Follow us on

స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మంధన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‏గా కనిపించనున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యం శెట్టి మీడియా బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార పోస్టర్లకు విశేషస్పందన లభించింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్.

బన్నీ ‘పుష్ప’ సినిమా స్వాతంత్ర దినోత్సవానికి రెండు రోజుల ముందు అంటే ఆగస్ట్ 13న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. దీంతోపాటు బన్నీ న్యూలుక్ పోస్టర్‏ను కూడా విడుదల చేశారు. అందులో బన్సీ చేతిలో గొడ్డలి పట్టుకొని ఫుల్ మాస్ లుక్‏లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రయూనిట్. వరుసగా టాప్ హీరోల సినిమాలను విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.

Also Read:

Ghani Movie Update: వరుణ్ తేజ్ ‘గని’ వచ్చేది అప్పుడే.. అఫీషియల్‏గా ప్రకటించిన చిత్రయూనిట్..