‘నారాయణాద్రి’కి నయా సొగసులు… కుదుపులకు బ్రేక్!

'నారాయణాద్రి'కి నయా సొగసులు... కుదుపులకు బ్రేక్!

లింగంపల్లి- తిరుపతి మధ్య నడిచే నారాయణాద్రి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సరికొత్త హంగులు దిద్దుకుంది. నిత్యం వేలాది మంది భక్తులతో ప్రయాణించే ఈ రైలును ఆధునీకరించారు. అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలు..బయో టాయిలెట్.., ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ ఇంజన్‌‌తో కుదుపులు లేకుండా.. ఇకపై ప్రయాణీకులు ప్రశాంతంగా ప్రయాణించవచ్చు. అంతేకాకుండా దీని ప్రయాణ వేగం కూడా పెరిగింది. అనుకున్న సమయం కంటే 20 నిముషాలు ముందుగానే తిరుపతి చేరుకుంటుంది. ఇప్పటివరకు సాధారణ బోగీలతో నడిచే ఈ ట్రైన్‌కు మెరుగైన భద్రత కల్పించేందుకు లింక్‌ […]

Ravi Kiran

|

Oct 19, 2019 | 6:47 PM

లింగంపల్లి- తిరుపతి మధ్య నడిచే నారాయణాద్రి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సరికొత్త హంగులు దిద్దుకుంది. నిత్యం వేలాది మంది భక్తులతో ప్రయాణించే ఈ రైలును ఆధునీకరించారు. అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలు..బయో టాయిలెట్.., ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ ఇంజన్‌‌తో కుదుపులు లేకుండా.. ఇకపై ప్రయాణీకులు ప్రశాంతంగా ప్రయాణించవచ్చు. అంతేకాకుండా దీని ప్రయాణ వేగం కూడా పెరిగింది. అనుకున్న సమయం కంటే 20 నిముషాలు ముందుగానే తిరుపతి చేరుకుంటుంది.

ఇప్పటివరకు సాధారణ బోగీలతో నడిచే ఈ ట్రైన్‌కు మెరుగైన భద్రత కల్పించేందుకు లింక్‌ హాఫ్‌మన్‌ బుష్‌ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లను సమకూర్చారు. వీటివల్ల ప్రయాణికులు ఎలాంటి కుదుపులు లేకుండా ఎంత దూరమైన ప్రయాణించేందుకు వీలవుతుంది. అలాగే కోచ్‌లు కూడా సౌకర్యవంతంగా ప్రయాణకులకు అనువుగా ఉండేలా పీవీసీ ఫ్లోరింగ్‌తో ఏర్పాటు చేశారు. అటు ఏసీ బోగీల్లో లైట్లు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu