నేడు శ్రీకాళహస్తి తప్ప.. మిగతా ఆలయాలు మూసివేత..!

| Edited By:

Jul 16, 2019 | 8:53 AM

ఇవాళ అర్థరాత్రి సంభవించనున్న చంద్రగ్రహణం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు యూతపడనున్నాయి. అర్థరాత్రి ఒంటిగంటన్నరకు మొదలైన గ్రహణం.. తెల్లవారుజామున నాలుగున్నరకు విడువనున్న తరుణంలో పదిగంటలపాటు ఆలయాలు మూతపడనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఆయా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం చంద్రగ్రహణం కారణంగా పదిగంటల పాటు మూసివేయనున్నారు. నేటి రాత్రి ఏడు గంటలకు మూసివేసి రేపు ఉదయం 5 గంటలకు తెరువనున్నారు. బుధవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. స్వామివారికి […]

నేడు శ్రీకాళహస్తి తప్ప.. మిగతా ఆలయాలు మూసివేత..!
Follow us on

ఇవాళ అర్థరాత్రి సంభవించనున్న చంద్రగ్రహణం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు యూతపడనున్నాయి. అర్థరాత్రి ఒంటిగంటన్నరకు మొదలైన గ్రహణం.. తెల్లవారుజామున నాలుగున్నరకు విడువనున్న తరుణంలో పదిగంటలపాటు ఆలయాలు మూతపడనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఆయా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయం చంద్రగ్రహణం కారణంగా పదిగంటల పాటు మూసివేయనున్నారు. నేటి రాత్రి ఏడు గంటలకు మూసివేసి రేపు ఉదయం 5 గంటలకు తెరువనున్నారు. బుధవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. స్వామివారికి వివిధ సేవలు నిర్వహించిన అనంతరం భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇవాళ, రేపు కలిసి 10 గంటల పాటు ఆలయాన్ని మూసివేయగా, దాదాపు 20 గంటలపాటు దర్శనాన్ని నిలిపివేయనున్నారు. ఇందుకు శ్రీవారి భక్తులు సహకరించాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

చంద్రగ్రహణం సందర్భంగా భద్రాద్రి ఆలయం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, సింహాద్రి అప్పన్న స్వామి ఆలయం, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం, అటు తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, అలాగే పలు ప్రముఖ ఆలయాలను కూడా మూసివేయనున్నారు.

కాగా.. మరోవైపు చంద్రగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. ముఖ్యంగా రాహు, కేతు గ్రహాల దోష నివారణ పూజలు చేయిస్తారు. రేపు ఉదయం మూడు గంటల నుంచి స్వామి, అమ్మవార్లకు గ్రహణ కాలాభిషేకం, సంకల్పం, అభిషేకం నిర్వహిస్తారు.