ఏపీ ఎంసెట్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

|

Sep 16, 2020 | 8:58 PM

ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి జరిగే ఎంసెట్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌ సహా మొత్తం 47 పట్టణాల్లో నిర్వహిస్తున్న ఎగ్జామ్‌కు.. 118 కేంద్రాలను సిద్ధం చేశారు.

ఏపీ ఎంసెట్‌ పరీక్షలకు సర్వం సిద్ధం
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి జరిగే ఎంసెట్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌ సహా మొత్తం 47 పట్టణాల్లో నిర్వహిస్తున్న ఎగ్జామ్‌కు.. 118 కేంద్రాలను సిద్ధం చేశారు. ఈనెల 25వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తం 2.72 లక్షల మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు.

కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫిజికల్‌ డిస్టెన్స్‌ ఉండేలా చూడడమే కాదు.. మాస్క్‌ తప్పనిసరి చేశారు. అభ్యర్ధులు గంటన్నర ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించిన అధికారులు.. నిమిషం ఆలస్యమైనా అనుమతించమన్నారు. ఉదయం 9 నుంచి 12 వరకు ఒక సెషన్‌, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండోసెషన్‌ నిర్వహిస్తారు.

పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్‌ బదులు ఫేస్‌ రికగ్నైజేషన్‌ విధానంలో విద్యార్థుల ఫోటోలు తీసుకుంటారు. విద్యార్థులు తమకు కరోనా లక్షణాలు లేవని సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది.