
Ala Vaikuntapuram Hindi Remake: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అల..వైకుంఠపురములో‘. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం రికార్డులు సృష్టించడమే కాకుండా.. అల్లు అర్జున్‌కు కమ్‌బ్యాక్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ హిందీలో రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ పాత్రలో బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ కనిపించనున్నాడు. ‘దేశీ బాయ్స్’ ‘డిష్యూం’ సినిమాలు తెరకెక్కించిన రోహిత్ ధావన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌తో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారని టాలీవుడ్ టాక్. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.