Akshaya Tritiya 2022: ప్రతీ ఏటా వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ నాడు ఈ అక్షయ తృతీయను జరుపుకొంటారు. అక్షయ త్రితియ అంటే బంగారం కొనడం, పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేస్తుంటారు చాలా మంది. గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని అందరూ విశ్వసిస్తారు.
శ్రీమహాలక్ష్మీ అమ్మవారు అన్ని ఐశ్వరాలకు అధినేత్రి. ఆమె అనుగ్రహం వుంటే చాలు జీవితంలో ఏ లోటు ఉండదు. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు. భారతీయ సమాజంలో బంగారానికి ఎక్కువ విలువ ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేనంతా బంగారం మనదేశంలోనే ఉంది. బంగారం అనేది సంపదకు చిహ్నం. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపద ఉంటుందన్న నమ్మకంతో బంగారాన్ని కొనుగోలు చేస్తాం.
ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయనీ, భగవంతునికి ఏది సమర్పించినా రెండింతలై మనకి తిరిగి వస్తుందని అందరూ నమ్ముతారు. అందుకే, కొద్దిగానైనా సరే బంగారం కొని భగవంతునికి సమర్పిస్తారు. కానీ, ప్రపంచంలో మనకి ఏదైనా ఇవ్వగల భగవంతుడి దగ్గరకు వెళ్లి డబ్బు, బంగారం అడగడం ఎంతవరకూ సబబు? ఆయన దగ్గర మనం కోరవలసింది అపారమైన జ్ఞానం. ఈ విశ్వంలో ఉన్న అమితమైన జ్ఞానసంపదను మనం కొల్లగొట్టగలిగితే ఎంత బాగుంటుందో కదా.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: