విమాన ప్రయాణికులకు శుభవార్త.. మే 4 నుంచి టికెట్ల బుకింగ్ షురూ!

| Edited By:

Apr 18, 2020 | 6:03 PM

భారత్‌లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. అందుకే లాక్ డౌన్ మే 3వరకు పొడిగించారు. అయితే.. వచ్చే నెల 4వ తేదీ నుంచి దేశీయ ప్రయాణాలకు టికెట్ల బుకింగ్‌ను ప్రారంభించనున్నట్టు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ

విమాన ప్రయాణికులకు శుభవార్త.. మే 4 నుంచి టికెట్ల బుకింగ్ షురూ!
Follow us on

భారత్‌లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. అందుకే లాక్ డౌన్ మే 3వరకు పొడిగించారు. అయితే.. వచ్చే నెల 4వ తేదీ నుంచి దేశీయ ప్రయాణాలకు టికెట్ల బుకింగ్‌ను ప్రారంభించనున్నట్టు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా తెలిపింది. అంతర్జాతీయ విమానాలకు మాత్రం జూన్ 1 నుంచి బుకింగ్స్ ప్రారంభం అవుతాయని పేర్కొంది. కరోనా వైరస్‌ మరింత విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించింది.

మరోవైపు.. ఎయిరిండియా దేశీయ విమానాల టికెట్ల బుకింగ్‌ను మే 3 వరకు నిలిపివేసింది. అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించిన బుకింగ్‌లను మే 31 వరకు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, మే 3తో లాక్‌డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఆ తర్వాతి రోజు నుంచి టికెట్ల బుకింగ్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఈనెల 20 నుంచి.. జాతీయ రహదారులపై.. టోల్ వసూల్.. 

Also Read: కరోనా లాక్‌డౌన్‌: కొడుకు కోసం.. 6 రాష్ట్రాలు దాటి.. 2,700 కిలోమీటర్లు ప్రయాణించి..!