కరోనా లాక్‌డౌన్‌: కొడుకు కోసం.. 6 రాష్ట్రాలు దాటి.. 2,700 కిలోమీటర్లు ప్రయాణించి..!

భారత్‌లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం పాటించడం తప్పనిసరి. అందుకే లాక్ డౌన్ కూడా పొడిగించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఒకటీ రెండూ కాదు... ఏకంగా 6 రాష్ట్రాలు దాటి 2,700 కిలోమీటర్లు

కరోనా లాక్‌డౌన్‌: కొడుకు కోసం.. 6 రాష్ట్రాలు దాటి.. 2,700 కిలోమీటర్లు ప్రయాణించి..!
Follow us

| Edited By:

Updated on: Apr 18, 2020 | 2:12 PM

భారత్‌లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం పాటించడం తప్పనిసరి. అందుకే లాక్ డౌన్ కూడా పొడిగించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఒకటీ రెండూ కాదు… ఏకంగా 6 రాష్ట్రాలు దాటి 2,700 కిలోమీటర్లు ప్రయాణించింది ఒక తల్లి. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకును చూడటానికి ఆ తల్లి పడుతున్న ఆవేదనను గమనించిన అధికారులు, మానవత్వం కలిగిన వ్యక్తులు తమ శక్తి మేరకు సహకరించారు. దీనితో సుదీర్ఘ ప్రయాణం చేసి కొడుకును చూసుకున్నతల్లి సంతోషానికి అంతులేకుండా పోయింది. కేరళకు చెందిన అరుణ్ కుమార్ రాజస్తాన్ లోని జోధ్ పూర్ లో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌గా పనిచేస్తున్నారు.

వివరాల్లోకెళితే.. ఫిబ్రవరిలో సెలవుపై గ్రామానికి వచ్చిన జవాన్‌ అనిల్‌ కుమార్‌ కొద్దిరోజుల తర్వాత తిరిగి జోధ్‌పూర్‌ వెళ్లిన కొద్దివారాలకే అస్వస్ధతకు లోనయ్యారు. తన ఆరోగ్యం బాగాలేదని తన తల్లి, భార్యను చూడాలని వైద్యులకు చెప్పడంతో వారు అనిల్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీనితో అతని తల్లి షీలమ్మ వాసన్‌ లాక్‌డౌన్‌ నియంత్రణలను లెక్కచేయకుండా కుమారుడిని చూసేందుకు బయలుదేరారు. పరిస్దితిని గమనించిన కొట్టాయం జిల్లా కలెక్టర్ పీకే సుధీర్‌ బాబు అవసరమైన పాస్‌లను ఇవ్వడంతో షీలమ్మతో పాటు ఆమె కోడలు, మరో బంధువు జోధ్ పూర్ ప్రయాణమయ్యారు.

కాగా.. వీహెచ్‌పీ అనుబంధ హిందూ హెల్ప్‌లైన్‌ సభ్యులు.. వీరికి ఓ క్యాబ్‌తో పాటు ఇద్దరు డ్రైవర్లను ఉచితంగా సమకూర్చారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ కార్యాలయం, కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ, కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ వీరి ప్రయాణానికి తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో వారు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ల మీదుగామూడు రోజుల పాటు ప్రయాణించి రాజస్ధాన్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్బంగా షీలావాసన్ మాట్లాడుతూ దేవుడి దయ వల్ల ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా ఇక్కడకు చేరుకున్నామని తన కుమారుడి ఆరోగ్యం ఇప్పుడు కొద్దిగా మెరుగైందని ఆనందం వ్యక్తం చేసారు.