ఎవరినీ రౌడీలతో బెదిరించి సౌందర్యని పెళ్లి చేసుకోలేదు : ఎమ్మెల్యే ప్రభు

|

Oct 06, 2020 | 1:46 PM

డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోన్న సౌందర్యతో తన కులాంతర వివాహంపై తమిళనాట వెలువడుతోన్న ఊహాగానాలపై ఎఐఎడిఎంకె దళిత ఎమ్మెల్యే ప్రభు స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి వీడియో సందేశమిచ్చారు. ‘గత నాలుగు నెలలుగా నేను , సౌందర్య ప్రేమించుకుంటున్నాం. సౌందర్య ని వివాహం చేసుకోవాలని నా తల్లి దండ్రులతో సౌందర్య ఇంటికి వెళ్ళాను. సౌందర్య తండ్రి స్వామినాథన్ గారు మా పెళ్ళికి అంగీకరించలేదు. అప్పుడు మేము నా తల్లిదండ్రుల అనుమతితో ఒకరినొకరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. […]

ఎవరినీ రౌడీలతో బెదిరించి సౌందర్యని పెళ్లి చేసుకోలేదు :  ఎమ్మెల్యే ప్రభు
Follow us on

డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోన్న సౌందర్యతో తన కులాంతర వివాహంపై తమిళనాట వెలువడుతోన్న ఊహాగానాలపై ఎఐఎడిఎంకె దళిత ఎమ్మెల్యే ప్రభు స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి వీడియో సందేశమిచ్చారు. ‘గత నాలుగు నెలలుగా నేను , సౌందర్య ప్రేమించుకుంటున్నాం. సౌందర్య ని వివాహం చేసుకోవాలని నా తల్లి దండ్రులతో సౌందర్య ఇంటికి వెళ్ళాను. సౌందర్య తండ్రి స్వామినాథన్ గారు మా పెళ్ళికి అంగీకరించలేదు. అప్పుడు మేము నా తల్లిదండ్రుల అనుమతితో ఒకరినొకరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. నేను ఎవరినీ రౌడీలతో బెదిరించి పెళ్లి చేసుకోలేదు. అని ప్రభు క్లారిటీ ఇచ్చారు. అయితే, ఈ వీడియోలో పక్కనే ఉన్న సౌందర్య మాత్రం ఏమీ మాట్లాడలేదు.  ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్