సెప్టెంబర్ ఒకటి నుంచి లండన్ కు స్పైస్ జెట్ విమానాలు!

| Edited By:

Aug 05, 2020 | 5:14 PM

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం చాలా కాలం లాక్ డౌన్ విధించారు. దీంతో దేశీయ, అంతర్జాతీయ విమానాలు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే ఇండియన్ ఎయిర్ లైన్స్ అంతర్జాతీయ విమానాలను

సెప్టెంబర్ ఒకటి నుంచి లండన్ కు స్పైస్ జెట్ విమానాలు!
Follow us on

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం చాలా కాలం లాక్ డౌన్ విధించారు. దీంతో దేశీయ, అంతర్జాతీయ విమానాలు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే ఇండియన్ ఎయిర్ లైన్స్ అంతర్జాతీయ విమానాలను కొన్ని మార్గదర్శకాల మేరకు నడుపుతుండగా.. విమానాలు నడిపేందుకు స్పైస్ జెట్ కూడా సిద్ధమైంది. లండన్ హీత్రో విమానాశ్రయానికి వెళ్లేందుకు స్పైస్ జెట్ కు అనుమతి లభించింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి లండన్ కు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు స్పైస్ జెట్ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

గురుగ్రామ్‌కు చెందిన విమానయాన సంస్థను ద్వైపాక్షిక విమాన సేవల ఒప్పందం ప్రకారం ఇరు దేశాల ప్రభుత్వాలు భారత్-యుఎస్ మార్గాల్లో ప్రయాణించడానికి కూడా అనుమతించాయి. ఎయిర్ బబుల్ అనేది రెండు దేశాల విమానయాన సంస్థలు కొన్ని నియమ, నిబంధనలతో అంతర్జాతీయ విమానాలను నిర్వహించగల వ్యవస్థ. విశేషమేమిటంటే, భారతదేశం, బ్రిటన్ మధ్య బబుల్ ఒప్పందం ఉన్నది. రెగ్యులర్ ఆపరేషన్ల తరువాత భవిష్యత్తులో విమానాల సంఖ్యను పెంచవచ్చని స్పైస్ జెట్ తెలిపింది. శీతాకాలపు టైమ్‌టేబుల్‌లో రెగ్యులర్ ఆపరేటింగ్ స్లాట్ పొందడానికి చర్చలు జరుపుతున్నారు.

Read More:

మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా.. అయోధ్య..!

గుడ్ న్యూస్: 1167 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్