ఆలయాల్లో పూర్తిస్థాయి శానిటైజ్ చేశాకే భక్తులకు అనుమతి..

శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ క్రమక్రమంగా తగ్గుతోంది. కరోనా విషయంలో టీటీడీ కొండపై అత్యున్నత జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కరోనా భయంతో భక్తులు వెనకడుగు వేస్తున్నారు.

ఆలయాల్లో పూర్తిస్థాయి శానిటైజ్ చేశాకే భక్తులకు అనుమతి..

Updated on: Jul 25, 2020 | 10:01 AM

Pilgrims Will Be Allowed After Sanitization Of Temples: ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పలు నగరాలు స్వచ్చందంగా లాక్‌డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తిరుమల కొండపై 170 మంది ఉద్యోగులకు, 20మంది అర్చకులకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపధ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ క్రమక్రమంగా తగ్గుతోంది. కరోనా విషయంలో టీటీడీ కొండపై అత్యున్నత జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కరోనా భయంతో భక్తులు వెనకడుగు వేస్తున్నారు.

ఈ క్రమంలోనే దేవాదాయశాఖ కీలక ప్రకటన చేసింది. ఆలయాల్లో పూర్తిస్థాయిలో శానిటైజ్ చేసిన తర్వాతే భక్తులను అనుమతిస్తున్నామని తెలిపింది. భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు చేసుకోవచ్చునని… అన్ని ఆలయాల్లో కోవిడ్ నిబంధనలను పాటిస్తున్నామని వెల్లడించింది. కాగా, 65 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు, పదేళ్లలోపు చిన్నారులు ప్రస్తుతం ఆలయాలను సందర్శించకపోవడం మంచిదని దేవాదాయశాఖ స్ప్సతం చేసింది.

Also Read:

ఏపీ: ఇంటర్ విద్యలో మార్పులు.. అభిప్రాయాల సేకరణ..

 ‘పేరు’ కోసమే సుశాంత్ ప్రయత్నించాడు..అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు..

‘దిల్ బేచారా’ మూవీ రివ్యూ… కంటతడి పెట్టిన సుశాంత్ యాక్టింగ్..