బీహార్ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు పాకిన మెదడువాపు

| Edited By:

Jun 22, 2019 | 11:04 AM

మెదడువాపు వ్యాధి బీహార్ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు పాకింది. ముగ్గురు చిన్నారులు ఈ వైరస్ బారిన పడటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలకు వైద్య సేవలు అందిస్తున్నారు. బ్రెయిన్ ఫీవర్‌తో వారు బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ముగ్గురు పిల్లల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. వీరలో జపనీస్ జ్వరం లక్షణాలు కూడా ఉన్నట్లు చెప్పారు. ఈ వ్యాధిని చమ్‌కీ బుకర్ అని కూడా పిలుస్తారని అన్నారు. అధికారులు ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. […]

బీహార్ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు పాకిన మెదడువాపు
Follow us on

మెదడువాపు వ్యాధి బీహార్ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు పాకింది. ముగ్గురు చిన్నారులు ఈ వైరస్ బారిన పడటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలకు వైద్య సేవలు అందిస్తున్నారు. బ్రెయిన్ ఫీవర్‌తో వారు బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.

ముగ్గురు పిల్లల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. వీరలో జపనీస్ జ్వరం లక్షణాలు కూడా ఉన్నట్లు చెప్పారు. ఈ వ్యాధిని చమ్‌కీ బుకర్ అని కూడా పిలుస్తారని అన్నారు. అధికారులు ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక బీహార్‌లో చిన్నారుల మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే మెదడువాపు వ్యాధి బారిన పడి 136మంది చిన్నారులు మృత్యు ఒడిలోకి చేరారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల బంధువులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా షూ పాలిష్ చేసి నిరసన తెలిపారు.